మెంతులు.. ఇవి కర్రీలో వేయడం వల్ల రుచి వస్తుంది. అలానే మంచి సువాసనను వెదజల్లుతుంది. మెంతులను బాగా నానబెట్టి రుబ్బిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. ఇలా వంటలు, శిరోజాలకు మాత్రమే కాకుండా నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈరోజుల్లో అసిడిటి సమస్య అందరినీ బాధ పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి మెంతులు బాగా ఉపయోగపడుతాయి. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నానబెట్టిన అర టీస్పూన్ మెంతులు తినాలి. ఇలా చేయడం వల్ల అసిడిటి సమస్య తగ్గుతుంది.
నానబెట్టిన మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మెంతులే కాకుండా ఆ నీరు కూడా ఉపయోగపడుతాయి. నానబెట్టిన మెంతులు కంటే మొలకెత్తించిన మెంతులలో 30-40 శాతం ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి.
మెంతులు అసిడిటిని దూరంగా ఉంచడానికి సహాయపడుతాయి. నానబెట్టిన మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా తోడ్పడుతుంది.
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారికి నానబెట్టిన మెంతులు చక్కని పరిష్కారం. తరచూ వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మెంతులు నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, నొప్పులు మరియు ఇతర ఇబ్బందులను తగ్గించడానికి సహకరిస్తాయి.
మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు నొప్పులను నివారించే గుణాల వల్ల నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది . అంతే కాదు, మెంతుల పొడి తల నొప్పి, వికారం వంటి సమస్యలకు కూడా ఎంతో ఉపయోగకరం.
మెంతులు కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడడానికి ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనాల్లో తేలింది . మెంతులలో యాంటీ కాన్సర్ గుణాలు ఉండటం వల్ల వీటిని తీసుకొనే వారిలో కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తి పెంపొందుతుంది
మెంతులను పాలిచ్చే తల్లులలో పాల సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు.
ఈ మెంతులలో తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే ఫైటోఈస్ట్రోజెన్ ఉండటం వల్ల పాలిచ్చే తల్లులలో ఇది పాల సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది . మెంతులతో చేసిన టీ ని త్రాగడం వల్ల ఈ ఉపయోగాన్ని పొందవచ్చు. అంతేకాక పసి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా బరువు పెరగడానికి తోడ్పడుతుంది
ప్రతిరోజూ నానబెట్టిన మెంతులు తినలేకపోతే కూరల్లో వేసుకొని తినేలా చూసుకోవాలి. రోజుకి ఒక టేబుల్‌స్పూన్ కంటే మించి తినకూడదు. ఈ పద్ధతిని 21 రోజులు కంటిన్యూగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.