శ్రీ పంచమి రోజు ఏమీ చేయాలో తెలుసా? – Facts about Shree Panchami

శ్రీ పంచమి అంటే విశ్వం లో సరస్వతి దేవి అనే జ్ఞాన శక్తి ఆవిర్భవించిన రోజు.మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి  తిథినీ వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. మానవులను సృష్టించిన బ్రహ్మ దేవుడు వాక్కు ను ఇవ్వడం మరిచి పోయాడు, అందుకని బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రజాపతులు సైగలు మాత్రమే చేసేవారు. అప్పటికింకా భాష లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సృష్టిలో లోపాలను తెలుసుకొని వీళ్ళందరికీ సైగలు తప్ప నోటిమాట లేకుండా పోయింది. వీళ్ళు … Continue reading శ్రీ పంచమి రోజు ఏమీ చేయాలో తెలుసా? – Facts about Shree Panchami

చంద్రుని వలన ప్రతిష్టింపబడిన జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో తెలుసా…?

సోమనాథలింగం                   ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్టింపబడిందని చెబుతారు. దక్ష ప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైనా జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయినా చంద్రుడికి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటం వల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికీ ఇది … Continue reading చంద్రుని వలన ప్రతిష్టింపబడిన జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో తెలుసా…?

Daily sharing Bhagavad Gita 1-1&1-2 _ భగవద్గీత

ధృతరాష్ట్ర ఉవాచ: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః lమామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ll 1-1ధృతరాష్ట్రుడు పలికెను- ఓ సంజయా!యుద్ధ సన్నద్ధులై నా ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మునకు చేరియున్న నా కుమారులును పాండు పుత్రులు ను ఏమి చేసిరి? సంజయ ఉవాచ:దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా lఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ll 1-2సంజయుడు పలికెను - ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.

మకర సంక్రాంతి విశిష్టత- ఈరోజు దానం చేస్తే అంత ఫలితం వస్తుందా?

మకర సంక్రాంతి హిందూ మతం యొక్క ఒక ముఖ్యమైన పండుగగా పరిగణించబడుతుంది, సూర్యుడు దక్షిణ దిశలో (దక్షిణాయన) తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తరువాత ఉత్తర దిశ (ఉత్తరాయన) వైపు అడుగులు వేస్తాడు. ఉత్తరాయణ కాలం సూర్యుని రవాణా నుండి ప్రారంభమవుతుంది. మకరం నుండి మిధున రాశి  వరకు సూర్యుని ప్రయాణాన్ని ఉత్తరాయణ అని పిలుస్తారు మరియు మకరరాశిలో సూర్యుడు ప్రయాణించే రోజును మకర సంక్రాంతి అని పిలుస్తారు.సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటారుమొదటి రోజు భోగి: భోగి రోజు … Continue reading మకర సంక్రాంతి విశిష్టత- ఈరోజు దానం చేస్తే అంత ఫలితం వస్తుందా?

శ్రీకృష్ణుడు- బకాసురవధ ఎలా జరిగిందో మీకు తెలుసా?

దినము ఉదయమే గోపబాలకులు వారి లేగదూడలను అడవికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎండకు గురై విపరీతమైన దాహము కలుగగా, అలసిపోయిన వారి లేగదూడలను వారిలో వారు విభజించుకొని ఒక మంచినీటి కొలనులో వాటి చేత నీరు తాగించి వారు కూడా నీరు తాగి వస్తున్న సమయంలో .... (బకాసురుడు కొంగ రూపం లో మాటువేసి ఉన్నాడు)ఆ గోపకుమారులు ఆ దొంగకొంగ పొడవును నిర్ఘాంతపోయి చూస్తుండగా......ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్రచిత్తంతో అడవిలోని కొలనులో మునిలాగా నిలబడి … Continue reading శ్రీకృష్ణుడు- బకాసురవధ ఎలా జరిగిందో మీకు తెలుసా?

శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన గిరి పర్వతం ఎక్కడ ఉందో తెలుసా???- గోవర్ధనగిరి గురించి మీకు తెలియని నిజాలు

    సాధారణంగా గోవర్ధన పర్వతం అంటే చాలా ఎత్తుగా నిలబడి వుంటుంది అనుకుంటారు. కాని గోవర్థనగిరి పడుకున్న పర్వతం, ఎత్తు తక్కువగా వుంటుంది. చుట్టు కొలత మాత్రం 11కి.మి. ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని చూడకపోయిన దాని గురుంచి తెలియని వారు వుండరేమో. బృందావనంలో నివసిస్తున్న సమయంలో కృష్ణుడు, గోపాలులు ఆచరిస్తున్న ఇంద్రయాగాన్ని ఆపించి, గోవర్ధన గిరికి పూజ చేయిస్తాడు. కోపగించిన ఇంద్రుడు ప్రళయ భయంకర మైన రాళ్ళవానతో బృందావన ప్రజలను ముంచేస్తాడు. అప్పుడు చిన్నికృష్ణుడు చిటికెన … Continue reading శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన గిరి పర్వతం ఎక్కడ ఉందో తెలుసా???- గోవర్ధనగిరి గురించి మీకు తెలియని నిజాలు

ప్రహ్లాదుని గుణ వర్ణన చదివితే భక్తుడు అంటే ఇలా ఉంటాడా అని అనిపిస్తుంది!- Baktha Prahlad Nature

 ఓ పరీక్షిత్తు మహారాజా! ఆ నలుగురిలో చక్కటి వివేకము కలిగిన వాడూ; సకల ప్రాణులను తనతో సమానులుగా చూచు వాడూ; సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్ళి మ్రొక్కు వాడూ; పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొను వాడూ; దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడు వాడూ; మిత్రులతో అన్నదమ్ములులా మెలగు వాడూ; దేవుళ్ళు అంటూ గురువులను భావించే వాడూ; ఆటలలో కూడా అబద్దాలు ఆడని వాడూ; చక్కటి మర్యాద గల వాడూ ప్రహ్లాదుడు … Continue reading ప్రహ్లాదుని గుణ వర్ణన చదివితే భక్తుడు అంటే ఇలా ఉంటాడా అని అనిపిస్తుంది!- Baktha Prahlad Nature

శ్రీ గజేంద్ర మోక్షం లో ని గజేంద్రుని పూర్వ జన్మ కథ మీకు తెలుసా?

 శ్రీ గజేంద్ర మోక్షం లో ని గజేంద్రుని పూర్వ జన్మ కథ మీకు తెలుసా?       పరీక్షిన్మహారాజా! ఒక రోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా ఏకాగ్రచిత్తంతోఉన్నాడు. అప్పుడు అక్కడకి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించ లేదని. లేవకుండ మౌనంగా ఉన్నాడని ఆగ్రహించాడు “ఓరీ మూర్ఖుడా! పిసినిగొట్టు! ఏనుగు కడుపున జన్మించు.” అని అతనికి శాపమిచ్చాడు   అగస్త్య మునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు. … Continue reading శ్రీ గజేంద్ర మోక్షం లో ని గజేంద్రుని పూర్వ జన్మ కథ మీకు తెలుసా?