చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, సౌన్ సూద్ నటించిన కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య 2021 మే 13 న విడుదల కానుంది.
ఆచార్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. కొరటాల శివ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు.
మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి దానికన్నా టీజర్ చాలా బాగుంది.మెగాస్టార్ చిరంజీవి లుక్ వైస్ చాలా బాగున్నారు ఫైట్స్ చాలా బాగున్నాయి ,ఈ సినిమా అన్ని సినిమాల కన్నా రికార్డులను బద్దలు కొడుతుందని అనిపిస్తుంది. ఈ సినిమా టీజర్ చూస్తే ఒక ఊరిలో జరిగిన అన్యాయం గురించి ఆచార్య చేసే ఎదురు పోరాటం లాగా అనిపిస్తుంది. ఈ సినిమా హైవ్యాల్యూస్ తో నిర్మించినట్లు టీజర్లు స్పష్టంగా కనిపించింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ చాలా బాగుంది. మెగాస్టార్ చెప్పిన డైలాగ్ పాఠాలు చెప్పకపోయినా అందరూ ఆచార్య ఎందుకు అంటారు అంటే బహుశా గుణపాఠాలు చెపుతాను అని ఏమో అనే డైలాగ్ చాలా బాగుంది.
ఈ సినిమాలో తన తండ్రితో నటించినందుకు డైరెక్టర్ కొరటాల శివకు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు మరియు ఈ సినిమాలో నాది అతిథి పాత్ర కాదు పూర్తి స్థాయి పాత్ర అని తెలియజేసారు

Presenting #ACHARYA … మీకోసంhttps://t.co/IgjZ6llDL2@sivakoratala @MatineeEnt @KonidelaPro @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2021
(చిరు ట్విట్టర్ ఫొటోస్)