లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి
లవంగాలలో యుజనల్(eugenol) అనే పదార్థం లభ్యమవుతుంది, ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
లవంగాల లో మాంగనీస్ అధికంగా ఉంటుంది.దీనివల్ల ఎముకలు కండరాలు పుష్టిగా ఉంటాయి.
లవంగాల లో లభించే యూజినాల్ అనే పదార్థం కాలేయాన్ని రక్షించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
అధిక రక్తపోటు గుండెకు సంబంధించిన వ్యాధులు నయం చేయడానికి లవంగాలు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి, ధమని రక్తనళాలను వెడల్పుగా చేసి అధిక రక్తపోటును
తగ్గిస్తాయి.
లవంగాల లో యాంటీ వైరల్ యాంటీ బాక్టీరియా వంటి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
లవంగాలను కానీ లవంగాల పొడిని కానీ లవంగం నూనె ను కానీ రోజువారీగా మన శరీరంలోకి ఏదో విధంగా పంపించాలి, ఇలా చేస్తే సాధారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరం కఫం వంటివి దరిచరవు. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
లవంగాలు ఎక్కువగా తినడం కాలేయం దెబ్బ తింటుంది.
లవంగాలను నీటిలో వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల గొంతు సమస్య వ్యాధులు దూరం అవుతాయి.
లవంగాలు తినడం వల్ల వాంతులు అజీర్తి వంటివి దరిచేరవు.
లవంగాలు వేపాకు మరిగించి ఆ వాటర్ ని మౌత్ వాష్ లాగా అంటే నోట్లో వేసి పుక్కిలించి వేయడం పంటి సమస్యలు దూరం అవుతాయి మరియు పంటి పైన గారా పోతుంది.
గర్భిణీ స్త్రీలకు బాగా దాహంగా అనిపించినప్పుడు మరియు నలతగా అనిపించినప్పుడు ఒక లవంగం తినడం వల్ల ఈ సమస్య దూరం అవుతాయి.
లవంగాల లోని ఘాటు మన ఒంట్లో చేరిన ఫంగస్ ఇన్ఫెక్షన్ వంటి వాటి పై దాడి చేస్తాయి.
నోట్లో బాగా లాలాజలం ఊరికే వస్తుంటే ఒక లవంగం నోట్లో పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే ఈ సమస్య దూరమవుతుంది.
అతి మత్రం సమస్య ఉన్నవారు లవంగాల పొడిని,తేనే తో కలిపి తింటే ఈ సమస్య దూరం అవుతుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో చిటికెడు లవంగాల పొడి వేసి తాగితే తల నొప్పి తొందరగా తగ్గుతుంది.
వంట గదిలో ఉండేచెడు వాసనలు పోవాలంటే సగం కట్ చేసిన నిమ్మకాయ కు ఐదారు లవంగాలను గుచ్చి అలాగే ఉంచాలి. లవంగాలు నీటిలో మరిగించి ఆ నీటిని స్ప్రే చేస్తే ఈగలు పురుగులు రావు.