వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన దిల్ రాజు మరియు బోనీ కపూర్ నిర్మించిన భారతీయ తెలుగు భాషా కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ నటించారు. ఇది హిందీ చిత్రం పింక్ యొక్క రీమేక్. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు. COVID-19 మహమ్మారి కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది.
నిర్మాత దిల్ రాజు గారు వకీల్ సాబ్ టీజర్ ని తన యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేశారు.
టీజర్ ఫైట్ తో మొదలై మరియు పవన్ కళ్యాణ్ స్టైల్ , పెన్నుతో టిక్ టిక్ టిక్, లాయర్ గెటప్ లో గడియారం తిప్పుతూ , అబ్జెక్షన్ యువరానర్ అనే డైలాగ్ తో మొదలవుతుంది. ట్రైలర్ లో మెట్రో లో ఫైట్ సీన్ బాగుంది మరియు పవన్ కళ్యాణ్ స్టైల్ బాగుంది దానికి తోడు పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇంకా చాలా బాగుంది.
కోర్టులో వాదించడం తెలుసు, కొట్ తీసి కొట్టడము తెలుసు అనే డైలాగ్ తో ముగుస్తుంది.