విక్రమ్.. నిన్నటి తరం నటుల్లో ఈయన శైలి వైవిధ్యం. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘విలన్’, ‘మల్లన్న’, ‘ఐ’.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో రకం. తమిళ ప్రేక్షకులతో చియాన్ అని పిలిపించుకుంటోన్న విక్రమ్.. తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించారు. విక్రమ్ తాజాగా నటించిన కోబ్రా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.
ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మరియు యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇందులో చియాన్ కనిపించిన వైవిద్య వేషధారణ చాలా బాగుంది. ఇందులోని డైలాగ్ అన్నిటికీ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అనే డైలాగ్ తో మొదలై ఉత్కంఠభరితమైన ట్రైలర్ మొదలవుతుంది.
అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారిగా, శ్రీనిధి శెట్టి కూడా నటించారు. వయాకామ్ 18 స్టూడియోస్‌తో కలిసి దీనిని 7 స్క్రీన్ స్టూడియో నిర్మించింది మరియు ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.