కుంకుమ పువ్వు గురించి నిజాలు- Facts about saffron

ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు.


కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. 

మనిషి వాడిన మొదటి సుగంధద్రవ్యం ఇదేనట. సుగంధద్రవ్యాల్లోకెల్లా

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.

గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో, ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . 

ధనవంతులైన రోమన్లు గాడంగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట.

కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది. యాభైకి పైబడుతున్నవారు ఆహారంలో కుంకుమపువ్వు తీసుకుంటే కంటికి మేలని వైద్యుల సూచన.

ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.

కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.

గర్భిణులు పాలలో కుంకుమపువ్వు కలిపి తాగితే పుట్టే బిడ్డ నల్లగా కాక ఎర్రగా, తెల్లగా పుడతుందని నమ్మకం. అయితే శాస్త్రీయంగా ఇది సరైనది కాదని వైద్యులు చెప్తున్నారు. తల్లిదండ్రుల ఒంటిరంగును బట్టి, వారి జీన్స్ లో నిక్షిప్తమయిన సమాచారం సహాయంతో శరీరంలో వున్న \”మెలనో సైట్స్ \”నుండీ ఉత్పత్తి అయ్యే \”మెలనిన్ \”పరిమాణాన్ని బట్టి ఒంటి రంగు నిర్ణయమవుతుందే తప్ప కుంకుమపువ్వుకు ఈ విషయంలో ఏ ప్రభావం ఉండదని చెప్తున్నారు

Leave a comment