శుక్రాచార్యుడు- రాక్షసుల గురువు(Teacher of monsters)

                          శుక్రాచార్యుడు


మృతి చెందిన వాళ్ళను తిరిగి బతికించే విద్యే మృత సంజీవనీ విద్య! అలాంటి అద్భుతమైన మృత సంజీవనీ విద్య తెలిసినవాడు శుక్రుడు. దేవతలకు గురువు బృహస్పతి అయితే. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు.

 శుక్రుని తల్లి ఉశవ. తండ్రి భృగువు. ప్రియవ్రతుని కూతురైన ఊర్జస్వతిని పెళ్ళాడాడు. చండుడు, అమర్కుడు, త్వాస్టృడు, ధరాత్రుడు శుక్రుని సంతానమే!

బృహస్పతి తండ్రైన అంగీరసుని దగ్గరే బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకునేవాళ్ళు. విద్యను విద్యార్థులైన వాళ్ళకు సమానంగా నేర్పించాలి. కాని అంగీరసుడు ఆపనిచేయలేదు. శుక్రుణ్ని తక్కువ చేసి చూసాడు. తేడా గమనించిన శుక్రుడు గౌతముని దగ్గరకు వెళ్ళాడు తనకు విద్య నేర్పించమని కోరాడు.

లోకానికి గురువు ఆ ఈశ్వరుడేనని అతన్నే ప్రార్థించమన్నాడు. గౌతమీ తీరానా శివుని ధ్యానించి \’మృత సంజీవని\’ విద్యను నేర్పించమన్నాడు. శివుడు నేర్పించాడు. 

ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రుని తల్లిని చంపుతాడు. ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసురులను బతికిస్తూ రాక్షసులు దేవతలమీద విజయం సాధించేలా చేస్తాడు

 దాంతో చావు భయం లేకుండా పోయింది. దేవతలకు భయం పట్టుకుంది. అంధకాసురుణ్ని అంతం చేయాలన్న దేవతల ఆశ నెరవేరలేదు. శివుణ్ని, దేవతల్ని వేడుకోవడంతో శుక్రుణ్ణి శివుడే మింగేసాడు. దేవతలు అంధకాసురుణ్ని అంత మొందించారు. తరువాత శుక్ల రూపంలో శివుని శరీరంలోంచి బయట పడి నిజరూపం దాల్చాడని కాశీఖండంలో కథ ఉంది.


శుక్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటే – భంగం చేయమని తన కూతురు జయంతిని ఇంద్రుడు పంపాడనీ – అయితే శుక్రుడు తపస్సు పూర్తి చేసి బ్రహ్మచేత వరంపొంది వస్తూ జయంతిని చూసాడనీ – జయంతి శుక్రుని సంతానమే దేవయాని అనీ మత్స్యపురాణం చెపుతోంది.

అంతేకాదు, జయంతితో శుక్రుడు ఉన్న సమయంలో బృహస్పతి శుక్రుని వేషం ధరించి వస్తే రాక్షసులు తమ గురువేనని గుట్టు మట్టులన్నీ చెప్పుకున్నారని – ఇంతలో అసలు శుక్రుడు రావడం – ఎవరు తమ గురువో తేల్చుకోలేక పోవడం – అలా ఇద్దరూ తలపడడం – బృహస్పతి అంతర్ధానం కావడం కూడా జరిగిందట!

శుక్రుని దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకురమ్మని కచుణ్ని దేవతలు పంపించారు. కచుడు గురువుగారికి సేవలు చేసాడు. కచుని అవసరాన్ని గుర్తించి, ఆపదని గ్రహించి రాక్షసులు కచున్ని చంపేసారు. గురుపుత్రిక చొరవతో కచుడు తిరిగిప్రాణం పొందాడు. మరోసారి కచున్ని చంపి కాల్చి ఆ బూడిదని శుక్రునికి తెలియకుండా సురలో కలిపి తాగించేసారు. కూతురుపై మక్కువతో తన పొట్టలోని కచునికి మృత సంజీవని విద్యనేర్పాడు. కచుడు పొట్ట చీల్చుకు రావడంతో ప్రాణం విడుస్తాడు. కచుడు ప్రాణం పోస్తాడు. కనుక రాక్షసులకు సురా పానాన్ని నిషేధిస్తాడుశుక్రాచార్యుడు.

తను వచ్చిన పని అయిపొయింది కనుక యింక వెళ్ళిపోవడానికి గురువును అనుమతి అడుగుతాడు.కచుడు. కచుడు వెళ్లి పోతున్నాడని తెలిసి దేవయాని తను అతన్ని ప్రేమిస్తున్నాననీ అందుకనే యిన్ని మార్లు అతన్ని కాపాడా ననీ చెప్పి తననుపెండ్లిచేసుకోమంటుంది కచుడిని.కచుడు గురువు కూతురు సోదరితో సమానమని నేను చేసుకోనని అంటాడు కచుడు.దానితో ఆగ్రహించిన దేవయాని నీకు మృతసంజీవనీ విద్య పనికి రాకుండా పోతుందని శాప మిస్తుంది దేవయాని. .వెంటనే కచుడు నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికి వస్తుంది.అని చెప్పి అనుచితమైన కోరిక కోరినందు వల్ల ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతి శాపము యిస్తాడు కచుడు. కచుడు దేవతల దగ్గరికి వెళ్లి ఆ విద్య వారికి ఉపదేశిస్తాడు.ఈ విధంగా మృతసంజీవనీ విద్య దేవతలకూ సంప్రాపిస్తుంది.

బలి చక్రవర్తిని మూడడుగుల భూమి వామనుడు కోరితే – వచ్చినవాడు సామాన్యుడు కాదని, ఏమీ ఇవ్వ వద్దని, మాట తప్పిన దోషం లేదని శుక్రుడు చెప్పాడు. బలిని కాపాడాలనుకున్నాడు. దానమిచ్చే సందర్భంలో ఈగగా మారాడు. విడుస్తున్న నీటి ధార పడకుండా అడ్డుకోబోతే – వామనుడు పుల్లతో పొడిచాడు. దాంతో శుక్రుని కన్ను ఒకటి చితికిపోయింది. శుక్రుడు ఒంటికన్నుతో మిగిలాడు!.


reference link

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s